‘ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ’ సినిమా అప్ డేట్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్ ఇటీవలే ముంబైలో ఒక ప్రధాన షూటింగ్ షెడ్యూల్‌ను ముగించింది. కొత్త షెడ్యూల్ కోసం లొకేషన్స్ ను చూడటానికి టీమ్ అబుదాబికి వెళ్లింది. చిత్రీకరణ వచ్చే నెలలో తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే, జపనీస్-బ్రిటిష్ కొరియోగ్రాఫర్ హోకుటో కొనిషి, ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేయడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ఆయన ఓ పోస్ట్ పెట్టారు.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మరియు అట్లీతో ఉన్న ఫోటోలను పోస్ట్ చేశారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక బన్నీ కోసం అట్లీ ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను పూర్తి చేశాడని తెలుస్తోంది. మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఓ డాన్ చుట్టూ ఈ కథా నేపథ్యం సాగుతుందట. అన్నట్టు సన్ పిక్చర్స్ వారు ఈ ప్రాజెక్టును భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాలో నటించనున్న మిగిలిన నటీనటుల గురించి కూడా అప్ డేట్స్ ఇవ్వనున్నారు మేకర్స్.