తక్కువ కాలంలోనే స్టార్ స్టేటస్ దక్కించుకున్న కథానాయిక రష్మిక మందన్న. ఇటీవలే మహేష్ బాబు సరసన ‘సరిలేరు నీకవ్వరు’ చిత్రంలో మెరిసిన ఈమె ఈ యేడాది ‘భీష్మ’తో వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. దీంతో దర్శక నిర్మాతలు రష్మిక డేట్స్ కోసం గట్టిగానే ట్రై చేస్తున్నారు. ఇలా ఆఫర్లు వెల్లువలా వచ్చి పడుతున్నా రష్మిక మాత్రం కథల కోసం వెతుకుతోందట.
అవును… ఇంట్రెస్టింగ్ కథలు, కొత్త తరహా ఐడియాలు ఏవైనా ఉంటే తనకు, తన టీంకు ఈమెయిల్ ద్వారా తెలియజేయాలని, అవి బాగుంటే వాటి మీద వర్కవుట్ చేద్దామని అంటోంది రష్మిక మందన్న. మరి రష్మిక కథల కోసం ఇంతలా వెతకడం ఆమె కోసమేనా లేకపోతే వేరే సినిమాల కోసమా అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. ఇకపోతే ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ కలిసి చేస్తున్న చిత్రంలో కథానాయకిగా నటిస్తోంది.