ఫ్యాన్స్ తో ‘రాశి ఖన్నా’ ముచ్చట్లు !

ఫ్యాన్స్ తో ‘రాశి ఖన్నా’ ముచ్చట్లు !

Published on May 3, 2020 6:32 PM IST

లవ్లీ బ్యూటీ రాశి ఖన్నా ఈ లాక్ డౌన్ లో అభిమానుల కోరిక మేరకు వారితో ‘అస్క్ రాశీ’ అంటూ ట్విట్టర్ లో సరదాగా ఫ్యాన్స్ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఓ అభిమాని ‘తెలుగు ప్రేక్షకులు గురించి మీరెలా ఫీల్ అవుతున్నారు ?’ అని అడగగా.. ‘తెలుగు ప్రేక్షకులు నా ప్రాణం’ అంటూ రాశి ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది. అలాగే మరో అభిమాని ‘మీ ఆల్ టైం ఫేవరెట్ మూవీ ఏమిటి ?’ అని అడగగా ‘ద ప్రపోజల్’ అని చెప్పింది.

అలాగే మరో అభిమాని ‘మీకు నచ్చిన తమిళ్ దర్శకులు ఎవరు ?’ అని అడగగా.. ‘తమిళ పరిశ్రమలో అద్భుతమైన దర్శకులు చాలా మంది ఉన్నారు! నాకు వెట్రిమారన్ సార్, శంకర్ సర్, మణిరత్నం సర్ మరియు అట్లీ అంటే చాలా ఇష్టం’ అని చెప్పుకొచ్చింది. ఇక ‘అజిత్ గురించి మీరు ఏమనుకుంటున్నారో చెప్పండని’ ఓ అభిమాని అడగగా.. ‘చార్మింగ్” అని రాశి సమాధానం ఇచ్చింది.

‘అల్లు అర్జున్’ గురించి చెప్పమని ఓ అభిమాని కోరగా.. రాశి సమాధానం ఇస్తూ.. ‘బన్నీ తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ ఎంతో ప్రోత్సహిస్తారు. నేను ఆయన వర్క్ ను ప్రేమిస్తున్నాను. తనతో నటించడాన్ని ఇష్టపడతాను’ అని తెలిపింది. అలాగే మరో అభిమాని ‘తెలుగులో మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు ?’ అని అడగగా.. రాశి ‘సమంత’ అని తెలిపింది.

తాజా వార్తలు