ప్రశ్న & జవాబు : తమన్నా తో రాపిడ్ ఫైర్

ప్రశ్న & జవాబు : తమన్నా తో రాపిడ్ ఫైర్

Published on Dec 11, 2013 8:50 PM IST

Tamanna1
ప్రముఖ నటి తమన్నా ప్రస్తుతం ఫేస్ బుక్ లో అధికారికంగా జాయిన్ అయ్యింది. ఆమె ఈ ఫేస్ బుక్ లో తన అభిమానులు అడిగిన బోలెడు ప్రశ్నలకు ఓర్పుగా సమాధానమిచ్చింది. అందులో కొన్ని ప్రశ్నలు, దానికి ఆ వయ్యారి సమాధానాలు మీకోసం

ప్రశ్న) నటన కాక మీకు ఏమంటే ఇష్టం?
స) వండడం. నాకు దోసెలు వేయడం అంటే చాలా ఇష్టం

ప్రశ్న) మీ ఉత్తమ లక్షణాలు?
స) శిక్షణ మరియు తపన

ప్రశ్న) సెలిబ్రిటీల జీవితంలో కష్టమైన భాగం ఏది?
స) ఊహలకు తగ్గట్టు బతకడం

ప్రశ్న) మీరు ఎవరికి కృతజ్ఞులై వుంటారు?
స) నా కుటుంబానికి

ప్రశ్న) కోపాన్ని తగ్గించుకునే మంత్రం?
స) నిద్ర

ప్రశ్న) పిల్లులా, కుక్కలా?
స) డైనోసార్లు !!!

ప్రశ్న) ఇష్టమైన సంగీత దర్శకులు?
స) నాకు అందరూ ఇష్టమే.. కానీ దేవి శ్రీ ప్రసాద్, థమన్ కాస్త ఎక్కువ ఇష్టం

ప్రశ్న) మీకు బాగా నచ్చిన పాత్ర?
స) పైయా

ప్రశ్న) చరణ్, బన్నీ మరియు ఎన్.టి.ఆర్?
స) అందరూ రాక్ స్టార్ లే..

ప్రశ్న) నటన తేలికా లేక కష్టమా??
స) నటన ఒక అద్భుతం

తమన్నా అఫీషియల్ పేజ్ ని కింద లింక్ ద్వారా చూడొచ్చు https://www.facebook.com/Tamannaah

తాజా వార్తలు