అట్లీ, అల్లు అర్జున్ ల ప్రపంచం చూసి స్టన్నైన బాలీవుడ్ స్టార్

Atlee & Allu Arjun

ఇప్పుడు ఇండియన్ సినిమా నుంచి రాబోతున్న కొన్ని బిగ్ థింగ్స్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అలాగే దర్శకుడు అట్లీ కలయికలో చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ కూడా ఒకటి. అయితే అట్లీ ఇది వరకు చేసిన సినిమాలు అన్నీ ఒకెత్తు అయితే ఈ ఒక్క సినిమా మాత్రం ఇంకొక ఎత్తు అనేట్టు ప్లాన్ చేస్తున్నాడు. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ గా బాలీవుడ్ స్టార్ నటుడు రణ్వీర్ సింగ్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

తన భార్య దీపికా పదుకోణ్ నటిస్తున్న సినిమా సెట్స్ లోకి వెళ్లానని, దర్శకుడు అట్లీ ఒక కొత్త ప్రపంచాన్ని ఇండియన్ సినిమాకి పరిచయం చేయబోతున్నాడు ఇది వరకు ఎవరూ చూపించనిది తాను ప్రెజెంట్ చేస్తున్నాడని చెప్పడం ఓ రేంజ్ లో హైప్ ఇచ్చే విధంగా మారింది. దీనితో తన కామెంట్స్ పాన్ ఇండియా లెవెల్లో వైరల్ గా మారాయి. ఇక ఈ చిత్రానికి సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తుండగా వచ్చే ఏడాదిలోనే రిలీజ్ కి తీసుకురావచ్చు.

Exit mobile version