బాలీవుడ్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన చిత్రాల్లో స్టార్ నటుడు రణ్వీర్ సింగ్ నటించిన ఇంటెన్స్ అండ్ గ్రిప్పింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “ధురంధర్” కూడా ఒకటి. మంచి బజ్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా షాకింగ్ రన్ టైం మూడున్నర గంటల వ్యవధితో వచ్చింది. అయినప్పటికీ ఆడియెన్స్ ని ఎంగేజ్ చేస్తున్న ఈ సినిమా బాలీవుడ్ మార్కెట్ లో మంచి ఓపెనింగ్స్ ని సాధించినట్టు కన్ఫర్మ్ అయ్యింది.
ఇలా మొదటి రోజు ఈ సినిమా 28.6 కోట్ల నెట్ వసూళ్లు కేవలం ఇండియా నుంచే రాబట్టిందట. సో వరల్డ్ వైడ్ ఈ లెక్క మరింత ఉంటుంది అని చెప్పాలి. చాలా కాలం తర్వాత రణ్వీర్ నుంచి సాలిడ్ సినిమా పడింది కాబట్టి మంచి లాంగ్ రన్ దీనికి పడే అవకాశం ఉంది. సో లాంగ్ రన్ లో ఈ సినిమా ఎక్కడ ఆగుతుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో అక్షయే ఖన్నా, సంజయ్ దత్ తదితరులు నటించగా ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు.
