రంగమార్తాండ కోసం ట్యూన్స్ సెట్ చేస్తున్న ఇళయరాజా

రంగమార్తాండ కోసం ట్యూన్స్ సెట్ చేస్తున్న ఇళయరాజా

Published on Mar 16, 2020 7:47 PM IST

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ కెరీర్ లో అనేక సూపర్ హిట్ మూవీస్ తెరకెక్కించాడు. ఈ సీనియర్ దర్శకుడు తెరకెక్కిస్తున్న తాజా చిత్రం రంగమార్తాండ. ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఇప్పటికే చాల భాగం ఈ చిత్ర షూటింగ్ కంప్లీట్ చేయగా ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. అలాగే హాస్యబ్రహ్మ బ్రహ్మనందం కూడా ఓ కీలక రోల్ చేస్తున్నారు.

కాగా ఈ చిత్ర మ్యూజిక్ సిట్టింగ్స్ దర్శకుడు మొదలుపెట్టినట్టున్నారు. మేస్ట్రో ఇళయరాజా రంగమార్తాండ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఆయనతో మ్యూజిక్ సిట్టింగ్స్ లో ఉన్న ఫోటోను కృష్ణ వంశీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇక రంగమార్తాండ మరాఠీ సూపర్ హిట్ మూవీ నటసామ్రాట్ కి తెలుగు రీమేక్.

తాజా వార్తలు