పరిశ్రమ లో తిరుగుతున్న సమాచారం ప్రకారం రానా దగ్గుబాటి నూతన చిత్రం “నా ఇష్టం” ట్రైలర్ ని రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చిత్రం “మిస్టర్ నూకయ్య” లో ప్రదర్శించబోతున్నారు ఈ ట్రైలర్ నిడివి 90 సెకండ్ లు ఉంటుంది. రానా నటించిన “నా ఇష్టం” చిత్రం మార్చ్ 23న విడుదలకు సిద్దమయ్యింది ఈ చిత్రం లో జెనిలియా కథానాయికగా నటించింది ప్రకాష్ తోలేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇదిలా ఉండగా “మిస్టర్ నూకయ్య” చిత్రం యువత మరియు స్టూడెంట్స్ ని బాగా ఆకట్టుకుంది మనోజ్ ఇందులో చేసిన పోరాటాలు చిత్రానికి పెద్ద ఆకర్షణ అంటున్నారు.