రానా కొత్త చిత్ర షూటింగ్ ప్రారంభం

రానా కొత్త చిత్ర షూటింగ్ ప్రారంభం

Published on Jan 23, 2012 4:35 PM IST


టాలీవుడ్ యువతరం నటుల్లో ఒకరైన రానా కొత్త చిత్రం క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ‘కృష్ణం వందే జగద్గురుం’ షూటింగ్ ఈ రోజు నుండే ప్రారంభమయింది. జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ ఫ్రేం ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. క్రిష్ గతంలో ‘గమ్యం’, ‘వేదం’ చిత్రాలకు దర్శకత్వం వహించగా ఇది ఆయన డైరెక్ట్ చేస్తున్న మూడవ చిత్రం.

ఈ చిత్రంలో రానా పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు అనేది ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు. ఈ చిత్రానికి ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు