రానా, నయనతారలు ప్రధాన పాత్రలలో రాబోతున్న చిత్రం “కృష్ణం వందే జగద్గురుం” ఒక్క పాట మినహా చిత్రీకరణ మొత్తం పూర్తి చేసుకుంది. ఈ మధ్యనే “రంగ మార్తాండ బి.టెక్ బాబు” అనే పాటను రానా,రఘు బాబు మరియు ఇతర నటుల మీద చిత్రీకరించారు. రానా ఈ చిత్రం కోసం చాలా కష్టపడి పని చేస్తున్నారు ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో గాయాల పాలయ్యారు. ఈ చిత్రానికి యాక్షన్ సన్నివేశాలు ప్రధాన ఆకర్షణ కానుంది. క్రిష్ మొదటి సారిగా పూర్తి యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సాయిబాబా జాగర్లమూడి మరియు వై రాజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా వి ఎస్ జ్ఞాన శేకర్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. అక్టోబర్లో ఈ చిత్రం విడుదల అయ్యే అవకాశాలున్నాయి. “నా ఇష్టం” చిత్రం తర్వాత రానా చేస్తున్న చిత్రం కాగా నయనతార “శ్రీ రామ రాజం” చిత్రం తరువాత చేస్తున్న చిత్రం ఇది.