రానా మిహిక బజాజ్ ల పెళ్లి ఆగస్టు 8న ఘనంగా జరగనుంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా పెళ్లి వాయిదా పడనుందని వార్తలు వచ్చాయి. ఐతే ఆ వార్తలో ఎటువంటి నిజం లేదని కుటుంబ సభ్యులు నిర్ధారించారు. కాగా మిహిక బజాజ్ ట్రెడిషన్ గెటప్ లో అందంగా తయారైన ఫోటో ఒకటి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. గ్రాండ్ లుక్ లో మిహిక బజాజ్ రాజకుమారిలా ఉన్నారు.
ఇక రానా నటించిన అరణ్య విడుదలకు సిద్ధంగా ఉంది. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రాల్లో రానా ఓ ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నారు. అలాగే తెలుగులో ఆయన నటిస్తున్న విరాట పర్వం మూవీ షూటింగ్ దశలో ఉంది. వేణు కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రియమణి నక్సల్ పాత్ర చేస్తున్నారు.