మీరు వింటున్నది నిజమే.. యంగ్ హీరో రానా తేజ దర్శకత్వంలో ఒక చిత్రం చేయబోతున్నడనే వార్త ప్రస్తుతం ఫిల్మ్ నగర్లో బాగా వినిపిస్తోంది. తేజ చెప్పిన కథ రానాకి విపరీతంగా నచ్చేయడంతో సినిమాకి అంగీకారం తెలియజేసినట్లు సమాచారం. ప్రస్తురం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ” కృష్ణం వందే జగద్గురుమ్” చిత్ర చిత్రీకరణలో రానా బిజీగా ఉన్నారు. ఈ చిత్రం పూర్తయిన తర్వాత తేజ చిత్రం మొదలయ్యే అవకాశం ఉంది. వరుస పరాజయాల బాటలో ఉన్న తేజ దర్శకత్వంలో ఇటీవలే వచ్చిన ‘నీకు నాకు డాష్ డాష్’ చిత్రం కూడా పరాజయం పాలవడంతో రానాతో చేయబోయే చిత్రానికి కథ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టి తన పూర్వ వైభవాన్ని పొందాలనుకుంటున్నాడు.