బాహుబలి షూటింగ్ లో పాల్గొంటున్న రానా

బాహుబలి షూటింగ్ లో పాల్గొంటున్న రానా

Published on Oct 30, 2013 2:04 PM IST

Rana-Daggubati
టాలీవుడ్ యంగ్ హంక్ రానా దగ్గుబాటి ‘బాహుబలి’ సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ పీరియాడికల్ డ్రామా సినిమాలో రానా ప్రభాస్ బ్రదర్ గా కనిపించనున్నాడు. రానా ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ లో పాల్గొంటున్నాడు. రానా మరియు ప్రముఖ నటులపై ప్రస్తుతం కొన్ని సీన్స్ ని షూట్ చేస్తున్నారు.

రమ్యకృష్ణ రాజమాతగా కనిపించనున్న ఈ సినిమాలో నాజర్, సత్యరాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 2015 లో రిలీజ్ కానున్న ‘బాహుబలి’ సినిమాపై ఆకాశాన్ని తాకే రేంజ్ లో భారీ అంచనాలున్నాయి. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని ఆర్కా మీడియా బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తుండగా, పీటర్ హెయిన్స్ యాక్షన్ ఎపిసోడ్స్ కంపోజ్ చేస్తున్నారు.

తాజా వార్తలు