రానా దగ్గుబాటి హీరోగా వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ హాథీ మేరే సాథీ. మూడు బాషలలో పాన్ ఇండియా ఈ చిత్రంగా విడుదల కానుంది. తెలుగులో అరణ్య పేరుతో వస్తుండగా తమిళంలో కాడన్ పేరుతో విడుదల కానుంది. కాగా ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సివుంది. రానా దగ్గుబాటి వ్యక్తిగత పనుల కోసం దాదాపు మూడు నెలలు అమెరికాలో గడిపారు. దీని వలన ఈ చిత్ర షూటింగ్ డిలే అయ్యింది.
ట్విట్టర్ వేదికగా రానా తన అభిమానులకు సారీ చెప్పారు. మళ్ళీ నానుండి మూడేళ్ళ తరువాత ఓ నేషనల్ వైడ్ రిలీజ్ మూవీ వస్తుంది. చాలా వెయిట్ చేయించాను క్షమించాలి, కానీ మీ నిరీక్షణకు తగ్గ ఫలితం ఈ చిత్రం ఇస్తుంది. ఓ అడవిని కాపాడడం కోసం జరిగే ఓ పెద్ద యుద్దాన్ని చూడండి అని ట్వీట్ చేశారు. అరణ్య సినిమాను దర్శకుడు ప్రభు సోలొమన్ తెరకెక్కిస్తుండగా, ఏరోస్ ఇంటర్నేషనల్ నిర్మిస్తున్నారు. విష్ణు విశాల్ తెలుగు మరియు తమిళ వర్షన్స్ లో నటించారు.
Back with a release nationally after 3 years!! Sorry for the delay but I promise you it’s worth the wait…..Witness the biggest fight to #SaveTheForest???? in #Aranya (Telugu) #Kaadan (Tamil) #HaathiMereSaathi (Hindi) on April 2, 2020 at a theatre near you. pic.twitter.com/LokSBshloX
— Rana Daggubati (@RanaDaggubati) February 10, 2020