ప్రచారంలో రాజమౌళిని ఫాలో అవుతున్న క్రిష్

ప్రచారంలో రాజమౌళిని ఫాలో అవుతున్న క్రిష్

Published on Dec 11, 2012 3:00 AM IST


సినిమాని బాగా తీయడమే కాదు దానిని సరిగా ప్రమోట్ చేసుకోవడంలోనూ చాలా టెక్నిక్స్ ఉన్నాయి. ఈ టెక్నిక్స్ తెలిసిన వాళ్ళు తమ సినిమాని వీలైనంత బాగా ప్రమోట్ చేసుకుని భారీ విజయాలు అందుకున్నారు. తెలుగు పరిశ్రమ విషయానికి వస్తే ప్రేక్షకుడి నాడి తెలిసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాజమౌళి ప్రమోట్ చేసుకోవడంలో కొత్త ఐడియాలు క్రియేట్ చేసేవారు. ఆయన ఈగ సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి ఆయన బుల్లితెరని ఎంచుకున్నారు. చంద్రముఖి అనే సీరియల్లో నటించి ఆయన సినిమాని ప్రమోట్ చేసుకున్నారు. ఇటీవల విడుదలైన కృష్ణం వందే జగద్గురుం సినిమాకి ఇదే తరహా ప్రమోషన్ చేసారు. ఈటీవి ఛానల్లో వచ్చే పుత్తడి బొమ్మ అనే సీరియల్లో నటించి తమ సినిమాని ప్రమోట్ చేసుకున్నారు. ఈ ఎపిసోడ్ ఈ రోజే టెలికాస్ట్ అయింది

తాజా వార్తలు