రాజమౌళి సినిమాలో రానా?

Prabhas-And-Rana
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్ నడుస్తుంది. ఆ వార్త సారాంశం ఏంటంటే రాజమౌళి రూపొందిస్తున్న నెక్స్ట్ సినిమాలో రానా నటిస్తున్నాడని. అవును ప్రభాస్ హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న సినిమాలో ప్రభాస్ కూడా నటిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం ప్రకారం రానా ఈ సినిమాలో నెగటివ్ పాత్రలో నటిస్తాడని సమాచారం. ప్రభాస్ తో పోరాడడానికి రానా సరిగ్గా సరిపోతాడనేది వాస్తవం. ఈ వార్త నిజమైతే అటు ప్రభాస్, రానా అభిమానులే కాకుండా ఇటు సినీ అభిమానులకు కూడా శుభవార్తే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా 2013లో సెట్స్ పైకి వెళ్లనుంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాని ఆర్కామీడియా బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

Exit mobile version