ఆ భారీ సినిమాలో రానా నటించట్లేదు !


రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న ‘రాధే శ్యామ్’ సినిమాలో రానా ప్రత్యేక పాత్రలో రెండు నిముషాల పాటు కనిపించబోతున్నాడనే వార్త రీసెంట్ గా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అయితే ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదట. ఈ సినిమాలో రానా నటించట్లేదు.

ఇక లాక్ డౌన్ కి ముందు జార్జియాలో చిత్రీకరణ జరుపుతున్న టీమ్ కరోనా కారణంగా కొంత షూట్ మిగిలి ఉండగానే ఇండియాకు తిరిగివచ్చేశారు. కాగా మిగిలిన బ్యాలెన్స్ పార్ట్ షూట్ ను కరోనా ప్రభావం తగ్గాక రామోజీ ఫిల్మ్ సిటీలో తీయనున్నారు. మిగిలిన షూటింగ్ మొత్తం దాదాపు ఫిల్మ్ సిటీలోనే తీస్తారట.

ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలో కూడా రూపొందించి ఇతర భాషల్లోకి అనువదిస్తారట. ఇకపోతే ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయకిగా నటిస్తోంది. ఈ సినిమా పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో నడిచే రొమాంటిక్ ఎంటెర్టైనర్ అని తెలుస్తోంది. ఈ చిత్రంపై ప్రభాస్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Exit mobile version