2010లో లీడర్ తో తెరారంగ్రేటం చేసిన నటుడు దగ్గుబాటి రానా. ఈ నటుడు తనకున్న అదృష్టంతో అతి తక్కువ సమయంలో బాలీవుడ్ లో మంచి ఆఫర్ లని చేజిక్కించుకున్నాడు. కాకపోతే అతను నటించిన దమ్ మారో దమ్, డిపార్ట్మెంట్ సినిమాలు పరాజయం పాలయ్యాయి. ఏ జవాని ఏ దివానీ సినిమాలో తళుక్కున మెరిసినా మరో సినిమా చెయ్యడానికి అతనికి చాలా సమయం పట్టింది
కాసింత విరామం తరువాత రానా ఇప్పుడు అజయ్ దేవగన్ తో కలిసి నటించడానికి ముంబై వెళ్ళాడు. కాకపోతే ఇది ఒక టి.వి యాడ్ కు సంబంధించిన షూటింగ్. అభినయ్ డియో దర్శకుడు. ఈ ముంబైకి మళ్ళీ మళ్ళీ రావాలని ఉందని రానా చెప్పాడు
ప్రస్తుతం రానా బాహుబలి, రుద్రమదేవి వంటి చారిత్రాత్మక చిత్రాలలో నటిస్తూ బిజీగా వున్నాడు