నేషనల్ యాక్టర్ రానా ఎప్పుడూ ఎక్కువుగా వైవిధ్యమైన సినిమాలు చేయటానికి బాగా ఆసక్తి చూపిస్తాడు. ఇప్పుడు అలాంటి మరో వినుత్నమైన సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని బాలీవుడ్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి బాలీవుడ్ దర్శకుడు మిలింద్ రౌ దర్శకత్వం వహించబోతునట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మిలింద్ ఇప్పటికే రానాకు కథను కూడా వివరించాడని.. రానాకి కథ బాగా నచ్చిందని తెలుస్తోంది. ఈ సినిమా అతీంద్రియ శక్తుల నేపథ్యంలో సాగే పక్కా యాక్షన్ అడ్వెంచర్ అట.
ఇక ఇటీవలే రానా దగ్గుబాటి వివాహం మిహికా బజాజ్ తో హైదరాబాద్ లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. పలువురు కీలక బంధువులు మరియు సినీ పెద్దలు సమక్షంలో వీరి వివాహం జరిగింది. ఇక రానా – సాయి పల్లవి కలిసి చేస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. నక్సలైట్ ఉద్యమం నేపథ్యంలో సాగే ఈ సినిమాని డి. సురేష్‌బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తోన్నారు. ఈ సినిమాలో రానా కొత్తగా కనిపించబోతున్నాడు.