ఈటీవీ విన్ తో రమ్యకృష్ణ, ఐశ్వర్య రాజేష్ ల కొత్త సినిమా షురూ!

ఈటీవీ విన్ తో రమ్యకృష్ణ, ఐశ్వర్య రాజేష్ ల కొత్త సినిమా షురూ!

Published on Dec 10, 2025 2:04 PM IST

Pakashala-pantham

నిర్మాణ సంస్థ ‘కొల్లా’ ఎంటర్టైన్మెంట్ అలాగే ‘ఈటీవీ ఒరిజినల్స్’ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న కొత్త సినిమా నేడు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ‘పాకశాల పంతం’ అనే టైటిల్ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమం ఈరోజు రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా జరిగింది. ఈ చిత్రంలో సీనియర్ నటి రమ్యకృష్ణ, హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

ఈ సినిమాకు కరణ్ తుమ్మకొమ్మ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రవీణ్ కొల్లా నిర్మాత కాగా, చంద్రశేఖర్ మహదాస్ సహా నిర్మాతగా వహరిస్తున్నారు. ఇక ఈ సినిమా ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండగా సంజయ్ స్వరూప్, మహత్ రాఘవేంద్ర, ఎస్.ఎస్. కాంచీ, సమీరా భరద్వాజ్, రాకేష్ రాచకొండ, మాయా నెల్లూరి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఆర్‌.హెచ్‌. విక్రమ్ సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు