‘వారణాసి’ మహేష్ బాబు మరో సర్ప్రైజ్ నిజమేనా!?

‘వారణాసి’ మహేష్ బాబు మరో సర్ప్రైజ్ నిజమేనా!?

Published on Dec 10, 2025 7:08 AM IST

Varanasi

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ని దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్లో చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ సినిమానే వారణాసి. ఎన్నో అంచనాలు ఉన్న ఈ సినిమా ఇటీవల గ్రాండ్ టైటిల్ లాంచ్ చేసుకొని పాన్ వరల్డ్ లెవెల్లో రిజిస్టర్ అయ్యింది. ఇక ఈ సినిమా కోసం చూస్తున్న అభిమానులుకి టైటిల్ లాంచ్ లోనే మహేష్ బాబు విషయంలో జక్కన్న ఓ షాకింగ్ సర్ప్రైజ్ రివీల్ చేయడం జరిగింది.

మహేష్ బాబు రుద్ర, శ్రీరామునిగా కనిపిస్తారని అప్పుడు ఖరారు అయ్యింది. కానీ సినిమాలో మరో సర్ప్రైజ్ కూడా గ్యారెంటీ అనే టాక్. ఈ సినిమాలో మహేష్ మొత్తం 5 గెటప్స్ లో కనిపిస్తాడట. ఇంకో మూడు డిఫరెంట్ లుక్స్ సినిమాలో ఉన్నాయని వినిపిస్తుంది. సో ఇది కానీ నిజం అయితే అభిమానులకి పండగే అని చెప్పాలి. ఇక దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు