రామానాయుడు 137వ చిత్ర నిర్మాణానికి సకలం సిద్దం

రామానాయుడు 137వ చిత్ర నిర్మాణానికి సకలం సిద్దం

Published on Jan 27, 2013 3:57 AM IST

Ramanaidu

మూవీ మొఘల్ డి రామానాయుడు తన తరువాత చిత్రాన్ని నిర్మించడానికి సిద్దం అయ్యారు. ఈ చిత్రానికి పి సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. గతంలో సునీల్ కుమార్ రెడ్డి “సొంత ఊరు” మరియు “ఒక రొమాంటిక్ క్రైమ్ కథ” చిత్రానికి దర్శకత్వం వహించారు. రామానాయుడు నిర్మాణంలో రానున్న ఈ చిత్రం రానున్న నెలలో చిత్రీకరణ మొదలు పెట్టుకోనుంది. ఇది రామానాయుడు నిర్మాణంలో రానున్న 137వ చిత్రం కానుంది 1అయన 36వ చిత్రం “సింగ్ vs కౌర్” అనే పంజాబీ చిత్రం ఫిబ్రవరి మధ్యలో రానుంది. నిన్న ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డు లలో రామానాయుడు గారికి పద్మభూషణ్ అవాద్ దక్కింది. తరువాత ఎం చెయ్యబోతున్నారు అన్న ప్రశ్నకు స్పందిస్తు రామానాయుడు గారు ఇలా అన్నారు ” నేను ఒక చిత్రానికి దర్శకత్వం వహించాలి అనుకుంటున్నాను కొంతమంది మండే గుండెలు చిత్రాన్ని రీమేక్ చెయ్యమని చెప్పారు కాని నేను కొత్త కాన్సెప్ట్ ని చెయ్యాలనుకుంటున్నాను” అని అన్నారు.

తాజా వార్తలు