టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించిన లాస్ట్ చిత్రం “ఇస్మార్ట్ శంకర్” భారీ విజయం సొంతం చేసుకోవడంతో తన తర్వాత సినిమా “రెడ్” కు కూడా మంచి హైప్ నెలకొంది. ఇస్మార్ట్ శంకర్ తో మాస్ లో మరింత క్రేజ్ పెంచుకున్న రామ్ అదే హైప్ ను ఈ రెడ్ కు కూడా నిలుపుకున్నాడు.
అయితే ఈ చిత్రం మాత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా లాక్ డౌన్ అడ్డు పడడంతో ఆగాల్సి వచ్చింది. అలాగే ఆ మధ్య ఓటిటి ఆఫర్స్ వచ్చినప్పటికీ థియేటర్స్ లోనే విడుదల చెయ్యాలని మేకర్స్ డిసైడ్ అయ్యిపోయారు. ఇక ఇదిలా ఉండగా చిత్ర యూనిట్ ఒక థ్రిల్లింగ్ అప్డేట్ ఇవ్వడానికి రెడీ అయ్యారు.
రేపు ఉదయం 9 గంటల 30 నిమిషాలకు రామ్ నుంచి ఈ థ్రిల్లింగ్ అప్డేట్ రానుంది. మరి ఆ అప్డేట్ ఏంటి అన్నది తెలియాలి అంటే అప్పటి వరకు ఆగాల్సిందే. ఈ చిత్రాన్ని దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కిస్తుండగా మాళవికా శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా స్రవంతి రవి కిషోర్ నిర్మాణం అందిస్తున్నారు.