ఎందుకంటే ప్రేమంట కోసం కష్ట పడుతున్న రామ్

ఎందుకంటే ప్రేమంట కోసం కష్ట పడుతున్న రామ్

Published on Feb 5, 2012 6:51 PM IST

రామ్ తమన్నా జంటగా నటిస్తున్న ‘ఎందుకంటే ప్రేమంట’ చిత్రం షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఇటీవల ఈ చిత్ర నిర్మాత స్రవంతి రవి కిషోర్ నిర్మాతల మండలిలో తమన్నా పై ఫిర్యాదు చేసినట్లు సమాచారం.తమన్నా ఈ చిత్ర షూటింగ్ హాజరు కాకపోవడం పై ఆయన నిర్మాతల మండలిని ఆశ్రయించారు. ఇటీవల ఈ చిత్రానికి సంబందించిన పాట చిత్రీకరించాల్సి ఉండగా రామ్ ఆరోగ్యం సరిగా లేకపోయినా కూడా షూటింగ్ నిలిపివేయడం ఇష్టం లేక రామ్ అలాగే డాన్స్ వేసారు. కరుణాకరన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు