ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని తన అభిమానులకు ఓ విన్నపం చేశారు. వారు తన పుట్టిన రోజు వేడుకలు జరపరాదని కోరుకున్నారు. మీరు నన్ను ఎంతగా అభిమానిస్తారో అంతకు మించి నేను మిమ్మిల్ని పేమిస్తాను. మీ ఆరోగ్యం, క్షేమం నాకు ముఖ్యం, కావున ఎటువంటి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించవద్దు, ఇంటిలోనే క్షేమంగా ఉండండి అని ఆయన పిలుపునిచ్చారు.కరోనా వైరస్ వ్యాప్తి ప్రమాదకర స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. మే 15, 1988లో జన్మించిన రామ్ పోతినేని ఈ ఏడాది 32వ ఏట అడిగిడనున్నాడు.
ఇక ప్రస్తుతం రామ్ చేస్తున్న రెడ్ మూవీ తమిళ హిట్ మూవీ తాడం కి తెలుగు రీమేక్. ఈ చిత్రంతో రామ్ మొదటి సారి డ్యూయల్ రోల్ చేస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కిశోర్ తిరుమల తెరకెక్కిస్తున్నారు. స్రవంతి రవి కిషోర్ నిర్మిస్తున్నారు. మాళవిక శర్మ, నివేదా పేతురాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.