రామ్ లేటెస్ట్ లుక్ కేక..!

హీరో రామ్ లాక్ డౌన్ లో సరికొత్త లుక్ ట్రై చేస్తున్నారు. ఆయన క్లీన్ అండ్ నీట్ షేవ్ లో కనిపించి ఫ్యాన్స్ కి కిక్కిచ్చారు. మీసం కూడా లేకుండా ఉన్న రామ్ ని చూస్తుంటే టీనేజ్ బాయ్ లా గ్లామర్ అండ్ హ్యాండ్ సమ్ గా ఉన్నారు. ఇక గత ఏడాది ఇస్మార్ట్ శంకర్ తో సూపర్ హిట్ అందుకున్నాడు రామ్. డైనమిక్ డైరెక్టర్ పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ మూవీ 75 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టి రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

కాగా రామ్ తన ప్రస్తుత చిత్రం దర్శకుడు కిషోర్ తిరుమలతో చేస్తున్నారు. రెడ్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ మొదటిసారి డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఓ తమిళ్ హిట్ మూవీకి రీమేక్ గా వస్తున్న ఈ మూవీ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది.

Exit mobile version