యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని పి. మహేష్ బాబు డైరెక్ట్ చేస్తుండగా పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ రానుంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. అయితే, ఈ మూవీ లోని ఫస్ట్ సింగిల్ సాంగ్ కోసం రామ్ రైటర్ గా మారిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు సెకండ్ సింగిల్ సాంగ్ ‘పుప్పీ షేమ్’ కోసం రామ్ సింగర్ గా కొత్త అవతారం ఎత్తుతున్నాడు.
ఈ పాటను సెప్టెంబర్ 8న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఉపేంద్ర మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. వివేక్ – మెర్విన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను నవంబర్ 28న గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.