‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కోసం రామ్ కొత్త అవతారం.. హీరో మాత్రమే కాదండోయ్..!

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు పి.మహేష్ బాబు డైరెక్ట్ చేస్తుండగా అందాల భామ భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో ఈ మూవీపై సాలిడ్ బజ్ క్రియేట్ చేస్తుంది. ఇక తాజాగా ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.

ఈ సినిమాకు వివేక్, మెర్విన్ ద్వయం సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ సాంగ్‌గా ఓ లవ్ సాంగ్‌ను అనిరుధ్ రవిచందర్ పాడారు. రొమాంటిక్ మెలోడీ గా రాబోతున్న ఈ పాటకు రామ్ స్వయంగా లిరిక్స్ అందించాడు. దీంతో ఈ సినిమా కోసం రామ్ ఇప్పుడు లిరిసిస్ట్‌గా కూడా మారాడు.

ఇక ఈ పాటను జూలై 18న రిలీజ్ చేయనున్నామని.. ఈ పాట ప్రేక్షకులకు చాలా రోజుల పాటు గుర్తుండిపోతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ సింగిల్ సాంగ్ ఎలాంటి ఇంపాక్ట్ చూపెడుతుందో చూడాలి.

Exit mobile version