ఈరోజు టాలీవుడ్ చాక్లెట్ బాయ్ ఎనెర్జిటిక్ స్టార్ రామ్ పుట్టిన రోజు సందర్భంగా తన అభిమానులకు గాను తాను నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “రెడ్” నుంచి ఒక పవర్ ఫుల్ మాస్ సాంగ్ ను విడుదల చెయ్యడంతో అభిమానులు ఆ సాంగ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే తన ఈ పుట్టిన రోజును ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా ఎవరూ సెలెబ్రేట్ చెయ్యొద్దని రామ్ వారికి విన్నవించారు.
ఇదిలా ఉండగా రామ్ కు తన బృందం ఒక స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. ఈ స్పెషల్ రోజున రామ్ పోతినేని బృందం రక్తదానం చేసి తమ ఉదారతను చాటుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ మరియు ఐ బ్యాంక్ లో ఈ రోజు రక్త దానం చేసి రామ్ కు ఈ విధంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం “రెడ్” టీం విడుదల చేసిన మాస్ బీట్ డించక్ సాంగ్ యూత్ ను ఉర్రూతలు ఊగిస్తుంది.