మన తెలుగు సినిమా యువతలో మంచి ఆదరణ ఉన్నటువంటి టాలెంటెడ్ హీరోస్ లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కూడా ఒకరు. తనకి తెలుగు మార్కెట్ లోనే కాకుండా హిందీ ఆడియెన్స్ లో కూడా మంచి ఆదరణ ఉంది. ఇక ఇదే కాకుండా సోషల్ మీడియాలో కూడా రామ్ కి మంచి క్రేజ్ ఉంది. ఇదే ఒక బిగ్గెస్ట్ రికార్డు మన తెలుగు హీరోస్ లో ఎవరికీ లేని ఫీట్ అందించినట్టు తెలుస్తుంది.
ఇన్స్టాగ్రామ్ యాప్ లో ఓ సింగిల్ పోస్ట్ కి హైయెస్ట్ లైక్స్ వచ్చిన పోస్ట్ గా రామ్ పోతినేని చేసిన ఓ సింపుల్ పోస్ట్ హిస్టరీ సెట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ ఫీట్ మన తెలుగులో అందరు స్టార్స్ హీరోస్ తో చూసినా కూడా అత్యధికం అట. ఇంట్రెస్టింగ్ గా రామ్ నుంచి ఏ సినిమాకి కూడా సంబంధించింది కాకుండా సింపుల్ గా తన పిక్ షేర్ చేసుకున్న పోస్ట్ 7.6 మిలియన్ లైక్స్ సొంతం చేసుకుందట. దీనితో సోషల్ మీడియా యువతలో రామ్ క్రేజ్ కోసం చర్చగా మారింది. ఇక ప్రస్తుతం రామ్ నుంచి “ఆంధ్ర కింగ్ తాలూకా” అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.