రామ్ పోతినేని 22 టైటిల్ గ్లింప్స్ కి డేట్, టైం ఖరారు.!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కూడా ఒకరు. మరి రామ్ కొన్నాళ్ల పాటుగా మాస్ సినిమాలు చేస్తూ వచ్చి ఇపుడు మళ్ళీ క్లాస్ సినిమాతో పలకరించేందుకు వస్తున్నాడు. తన కెరీర్ 22వ సినిమాగా దర్శకుడు మహేష్ బాబుతో ప్లాన్ చేసిన ఈ చిత్రంపై మంచి బజ్ నెలకొంది. అయితే ఈ చిత్రం తాలూకా గ్లింప్స్ సహా టైటిల్ ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ డేట్ మరియు సమయాన్ని ఖరారు చేసేసారు.

దీనితో ఈ చిత్రం గ్లింప్స్ ఇంకా టైటిల్ లు ఈ మే 15 ఉదయం 10 గంటల 8 నిమిషాలకి రివీల్ చేస్తున్నట్టుగా తెలిపారు. మరి ఈ చిత్రానికి పెట్టిన టైటిల్ ఏంటి అనేది తెలియాలి అంటే రేపటి వరకు ఆగాల్సిందే. ఇక ఈ చిత్రంలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా మెర్విన్ సోలోమోన్ సంగీతం అందిస్తున్నారు అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version