రామ్ గోపాల్ వర్మ కార్యాలయంపై ఐ.టి దాడులు

rgv

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అందరికీ తన ట్వీట్ల ద్వారా షాక్ ఇస్తూవుంటాడు. అయితే అంధేరిలో మిలత్ నగర్ దగ్గర ఆయన ఆఫీస్ లో ఐ.టి వాళ్ళు దాడులు జరిపారు. ఈ దాడితో ఆర్.జీ.వి షాక్ కు గురయ్యారు. దాదాపు 8 గంటలపాటు ఆయనకు సంబంధించిన వివిధ ప్రొడక్షన్ హౌస్ లపై పలు ప్రశ్నలు సంధించారు.

ఈ ఐ.టి దాడులలో డ్రీమ్ ఫోర్స్ ప్రొడక్షన్స్ మరియు డ్రీమ్ హౌస్ ఎంటర్ప్రైస్ సంస్థల యొక్క అధికారిక రికార్డులు ఏమి లభ్యంకాలేదట. వాటిని నామమాత్రానికే పెట్టినట్టు వారి వాదన.

2008లో వరుస ఫ్లాపుల మూలంగా భారీ నష్టాలను చవిచూసిన అతని ప్రొడక్షన్ హౌస్ ను హైదరాబాద్ నుండి ముంబైకు మార్చాడు. ఇటీవలే 132 మంది ప్రముఖులకు టాక్స్ ఎవేషన్ కారణంగా నోటీసులను అందుకున్నారు . ఆ జాబితాలో రాము పేరు లేకపోవడంతో ఆయనపై ఈ ఆకస్మిక దాడులు జరిపారు.

Exit mobile version