రొమాంటిక్ సినిమాలపై దృష్టి పెట్టనున్న వర్మ

Ram-Gopal-Varma2

విలక్షణ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అనగానే గుర్తొచ్చేది ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలవడమే లేదా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం. అలాంటి వర్మ తాజాగా ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఆ విషయం పలువురికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అదేమిటంటే అండర్ వరల్డ్ సినిమాలు తీయడంలో వర్మకి మంచి పేరుంది. ఇప్పటికే సత్య’, ‘కంపెనీ’, ‘సర్కార్’ లాంటి సినిమాలతో తన టాలెంట్ ని నిరూపించుకున్నాడు. ఆయన తాజాగా తెరకెక్కించిన ‘సత్య2’ కూడా అండర్ వరల్డ్ కాన్సెప్ట్ తోనే తీయడం జరిగింది. కానీ వర్మ అందరూ షాక్ కి గురయ్యేలా ఇక ఆ కాన్సేప్త్ తో సినిమాలు చెయ్యను అంటున్నారు.

‘నేను అండర్ వరల్డ్ కాన్సెప్ట్ తో చేస్తున్న చివరి సినిమా సత్య 2. ఇక నుంచి అండర్ వరల్డ్ కాన్సెప్ట్ తో సినిమాలు చెయ్యను. ముందు ముందు రొమాంటిక్ సినిమాలు తియ్యాలని అనుకుంటున్నాను. ప్రస్తుతం రెండు లవ్ స్టొరీలు రెడీగా ఉన్నాయి. అందులో ఒకటి మార్షల్ ఆర్ట్స్ కి సంబందించిన మూవీ, అది ఈ డిసెంబర్లో మొదలవుతుందని’ వర్మ తెలిపారు.

Exit mobile version