మరో షాకింగ్ కాంట్రవర్సీకి తెరలేపిన వర్మ.!

తాజాగా నెలకొన్న పరిస్థితుల మూలాన మన టాలీవుడ్ లో ఉన్న అందరు దర్శకులు కూడా దాదాపు ఖాళీ గానే ఉన్నారు కానీ ఈ సంచలనాల దర్శకుడు తప్ప. ఈ గ్యాప్ లోనే పెద్ద చిత్రాలకు తక్కువ చిన్న చిత్రాలకు ఎక్కువ లాంటివి తీసేసి తనకు కావాల్సిన అటెన్షన్ ను తెచ్చుకున్నాడు ఈ వోడ్కర్ డైరెక్టర్.

ఇప్పటికే అతను ఎవరో కూడా అర్ధం అయ్యిపోయి ఉంటుంది. గత రోజుల కితమే పలు సున్నితమైన అంశాలను టార్గెట్ చేస్తూ కాంట్రవర్సీ లేపిన రామ్ గోపాల్ వర్మ ఇపుడు మరో సున్నితమైన అంశంపై సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించి సరికొత్త కాంట్రవర్సీకి తెరలేపాడు. గత ఏడాది రెండు తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపిన దిశా ఘటనపై సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించాడు.

అలాగే ఆ ఉదంతంను మరో సారి వివరిస్తూ ఆ చిత్రాన్ని ఆ ఘటన జరిగిన నవంబర్ 26 వ తారీఖునే విడుదల చేస్తానని తెలిపాడు. అలాగే ఈరోజు ఉదయం ఆ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ 11 గంటలకు విడుదల చేయనున్నట్టుగా తెలిపాడు. దీనితో నెటిజన్స్ భిన్నమైన స్పందనలను కురిపిస్తున్నారు.

Exit mobile version