జంజీర్ ట్రైలర్ కు అద్భుతమైన స్పందన

జంజీర్ ట్రైలర్ కు అద్భుతమైన స్పందన

Published on Jul 6, 2013 2:45 AM IST

Zanjeer
రామ్ చరణ్ బాలీవుడ్ లో నటిస్తున్న మొదటి సినిమా ‘జంజీర్’ క్రేజ్ ప్రస్తుతం సరైన మార్గంలో సాగుతుంది . హిందీలో ఈ సినిమా ట్రైలర్ విడుదలయ్యి విశేష స్పందనను అందుకుంది. ఈ సినిమా దర్శకుడు అపూర్వ లిఖియా ఈ స్పందనకు స్పందిస్తూ “జంజీర్ ట్రైలర్ కు 24 గంటలలో 200000 హిట్లు… అద్భుతమైన స్పందన… ఆశీర్వచనీయుడను… ధన్యవాదాలు ” అని ట్వీట్ చేసాడు. 1973లో అమితాబ్ ను యాంగ్రీ పోలీస్ ఆఫీసర్ గా చూపించిన సినిమాకు ఇది రీమేక్. ప్రియాంక చోప్రా హీరోయిన్. హిందీలో షేర్ ఖాన్ పాత్రను సంజయ్ దత్ పోషించాడు. తెలుగు వెర్షన్ లో ఆ పాత్రను శ్రీ హరి భర్తీ చేసాడు. ఈ సినిమా తెలుగు వెర్షన్ పేరు ‘తుఫాన్’. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్న ఈ సినిమాను రెండు భాషల్లోనూ సెప్టెంబర్ 6న విడుదలచెయ్యడానికి చూస్తున్నారు

తాజా వార్తలు