సంక్రాంతి బరిలోకి ఎవడు

yevadu
అభిమానులకు, ఇండస్ట్రీ వర్గాలకు, ట్రేడ్ పండితులకు రామ్ చరన నటించిన ‘ఎవడు’ సినిమా విడుదల తేదిపై లెక్కలేనంత కన్ఫ్యూజన్ నెలకొంది. ఈ సినిమా నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని డిసెంబర్ 19 మన ముందుకు తీసుకొస్తానని చెప్పినా తాజా సమాచారం ప్రకారం ‘ఎవడు’ సంక్రాంతి బరిలోకి దిగనుంది

ఈ వార్తను మరింత ద్రువీకరించడానికి రామ్ చరణ్ తన అఫీషియల్ పేస్ బుక్ పేజిలో ఈ సినిమా జనవరి 12న మనముందుకు రానుందని తెలిపాడు. ఈ ఏడాది జనవరి 9 న విడుదలైన ‘నాయక్’ మంచి విజయం సాధించిన సంగతి తెలిసినదే. వంశీ పైడిపల్లి తీసిన ఎవడులో రామ్ చరణ్ సరసన శృతిహాసన్, అమీ జాక్సన్ నటించారు. అల్లు అర్జున్, కాజల్ తళుక్కున మెరిసారు.

సెన్సార్ పనులు ఎప్పుడో పూర్తిచేసుకున్న ఈ సినిమా లో లెక్కకుమించిన ట్విస్ట్లు వున్నాయని సమాచారం. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. మరిన్ని వివరాలు త్వరలో తెలుపుతాం

Exit mobile version