జూన్ లో రానున్న రామ్ చరణ్ ఎవడు

జూన్ లో రానున్న రామ్ చరణ్ ఎవడు

Published on Apr 1, 2013 10:50 PM IST

Yevadu
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఎవడు’ సినిమాని జూన్ లో విడుదల చేయనున్నారు, ఈ సినిమా ఆడియో ఫంక్షన్ మే 9న జరుగనుంది. ఇప్పటికే ఈ సినిమా పోస్ట్ – ప్రొడక్షన్ మొదలైంది. శృతి హసన్, అమీ జాక్సన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాత. అల్లు అర్జున్, కాజల్ అగర్వల్ లు ఈ సినిమాలో అతిధి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా మర్డర్ మిస్టరీగా తెరకెక్కుతుందని సమాచారం. ఈ సినిమా విజయంపై దిల్ రాజు పూర్తి నమ్మకంతో ఉన్నాడు.

తాజా వార్తలు