మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాలీవుడ్ లో నటిస్తున్న సినిమా ‘జంజీర్’. ఈ సినిమా కోసం చరణ్ ముంభై లో వుండగా సల్మాన్ ఖాన్ చరణ్ గురించి చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఆ సమయం సల్మాన్ ఖాన్ చరణ్ కోసం ప్రతి రోజు షూటింగ్ జరిగే స్పాట్ కి ఇంట్లో ఫుడ్ వండించి పంపించేవాడు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ సిటీలోషూటింగ్ నిర్వహిస్తున్నాడు. ఈ అవకశాన్ని చరణ్ కూడా వదులుకోకుండా సల్మాన్ ఖాన్ కోసం రోజు రామ్ చరణ్ ఇంటినుండి హైదరాబాద్ స్పెషల్ ధంకా బిర్యానీ వండించి షూటింగ్ కు పంపిస్తున్నాడు. సల్మాన్ ఖాన్ హైదరాబాద్ బిర్యానీకి పెద్ద ఫ్యాన్ అన్నవిషయం అందరికి తెలిసిన విషయమే. రామ్ చరణ్ పంపిస్తున్న రుచికరమైన హైదరాబాద్ బిర్యానీ తిని సల్మాన్ ఖాన్ చాలా సంతోషిస్తున్నాడు.