రామ్ చరణ్ “ఆరెంజ్” అక్కడయినా విజయం సాదిస్తుందా?


రామ్ చరణ్ మరియు జెనిలియా ప్రధాన పాత్రలలో 2010లో వచ్చిన “ఆరెంజ్” చిత్రం తమిళంలో అనువదించబడుతుంది. ఆశ్చర్య కరంగా ఈ తమిళ అనువాద చిత్రానికి “రామ్ చరణ్” అనే పేరు పెట్టారు. “మగధీర” చిత్ర విజయం సాదించాక అక్కడ రామ్ చరణ్ నటించిన నాలుగు చిత్రాలను అనువదించారు. మొదట “మగధీర” చిత్రాన్ని “మావీరన్” అనే పేరుతో విడుదల చేసారు. తరువాత “రచ్చ” చిత్రాన్ని “రగలై” అనే పేరుతో విడుదల చేశారు. ఈ మధ్యనే “చిరుత” చిత్రాన్ని “సిరుతై పులి” అనే పేరుతో అనువదించారు. తాజాగా “ఆరెంజ్” చిత్రాన్ని అనువదిస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చాలా భాగం ఆస్ట్రేలియాలో చిత్రీకరించారు. చిత్రం విజయం సాదించకపోయినా హారిస్ జయరాజ్ అందించిన సంగీతం మరియు బి రాజశేఖర్,కిరణ్ రెడ్డి అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంటాయి.

Exit mobile version