రామ్ చరణ్ అనుకున్న టైం కంటే ముందే రానున్నాడా?


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘నాయక్’ సినిమా అనుకున్న టైం కంటే ముందే రానుందా? అవుననే అంటోంది ఈ చిత్ర ప్రొడక్షన్ టీం. ఈ సినిమాని మొదట 2013 జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామన్నారు, ఆ తర్వాత సంక్రాంతికి రావడంలేదు జనవరి చివర్లో వస్తుందన్నారు. కానీ తాజాగా ఈ చిత్ర ప్రొడక్షన్ టీం చెప్పిన దాని ప్రకారం ఈ చిత్రం జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అక్టోబర్ 9న వి.వి వినాయక్ పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా తెలుయజేయనున్నారాని సమాచారం. డి.వి.వి దానయ్య నిర్మిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో కాజల్ అగర్వాల్ మరియు అమలా పాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version