రామ్ చరణ్ రాబోతున్న చిత్రం “నాయక్” ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో అమల పాల్ మరియు కాజల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్లో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. గతనెలలో ఈ చిత్రం స్లోవేనియా మరియు ఐస్ ల్యాండ్లో చిత్రీకరణ జరుపుకుంది. ఈ మధ్యనే హైదరాబాద్లో మొదలయిన చిత్రీకరణలో రామ్ చరణ్ మరియు అమల పాల్ మీద సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర చిత్రీకరణ అక్టోబర్ 10 వరకు జరగనుంది. వి వి వినాయక దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డి వి వి దానయ్య నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2013 సంక్రాంతికి విడుదల కానుంది.