రామ్ చరణ్ – ఉపాసన వివాహ వేడుక వివరాలు

రామ్ చరణ్ – ఉపాసన వివాహ వేడుక వివరాలు

Published on Apr 26, 2012 3:04 PM IST


మెగా స్టార్ తనయుడు అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన వివాహ వేడుక త్వరలో జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ వివాహ వేడుకకి సంభందించిన కొంత సమాచారం మాకు లభించింది. గండిపేట లోని ఫామ్ హౌస్లో ఈ వివాహ వేడుక చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. జూన్ ౧౪ ఉదయం 9:45 గంటలకు ముహూర్తం నిర్ణయించినట్లు సమాచారం. ఇరు కుటుంబాలకు సంభందించిన సన్నిహితులు మరియు వివిఐపి లను మాత్రమే ఆహ్వానిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అంగరంగ వైభవంగా ఈ వివాహ వేడుక జరిపించనున్నట్లు సమాచారం. 2012లో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో జరిగే అతి పెద్ద వివాహ వేడుక ఇదే కానుంది. రామ్ చరణ్ నటించిన రచ్చ చిత్రం ఇటీవలే విడుదలై భారీ హిట్ అయింది.

తాజా వార్తలు