ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది అక్కినేని అఖిల్ – జయినాబ్ వివాహ వేడుక. ఎంతో అంగరంగ వైభవంగా అక్కినేని వారి ఇంట ఈ పెళ్లి వేడుక జరిగింది. ఈ వివాహం కోసం అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఇక అఖిల్ పెళ్లిలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు స్టార్స్ సందడి మామూలుగా లేదు.
ముఖ్యంగా అక్కినేని ఫ్యామిలీకి ఎంతో క్లోజ్‌గా ఉండేవారిలో మెగా ఫ్యామిలీ కూడా ఒకటి. ఇక అఖిల్ పెళ్లి వేడుకలో మెగా ఫ్యామిలీ మెంబర్స్ చేసిన సందడి అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన అక్కినేని అఖిల్ పెళ్లి వేడుకతో పాటు రిసెప్షన్‌లో కూడా సందడి చేశారు.
అఖిల్-జయినాబ్ కొత్త జంటతో రామ్ చరణ్ దంపతులు ప్రత్యేకంగా దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. దీంతో ఈ ఫోటోను అటు మెగా ఫ్యాన్స్‌తో పాటు అక్కినేని అభిమానులు కూడా వైరల్ చేస్తున్నారు. అక్కినేని వారి వేడుకలో కొణిదెల వారిదే సందడి అంటూ వారు కామెంట్స్ చేస్తున్నారు.