సి.సి.ఎల్ -3 లో రామ్ చరణ్ ఆడనున్నారా?

సి.సి.ఎల్ -3 లో రామ్ చరణ్ ఆడనున్నారా?

Published on Jan 20, 2013 4:06 AM IST

Ram-Charan-Tejaమూడవ దశ సెలబ్రిటీ క్రికెట్ లీగ్లో తెలుగు వారియర్స్ తరుపున రామ్ చరణ్ ఆడనున్నారా? ఈరోజు మెగా ఫాన్స్ మధ్యలో ఈ అంశం గురించే వాడి వేడి చర్చ జరిగింది. ఒక ప్రముఖ దిన పత్రిక వెంకటేష్ సారధ్యంలో తెలుగు వారియర్స్ టీం తరుపున రామ్ చరణ్ ఆడనున్నారు అని ప్రకటించింది. కాని ఈ సంఘటనకు సంభందించిన ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇదే కనుక నిజమయితే గత రెండు సీజన్ల కన్నా ఈ సీజన్ మరింత ఆసక్తికరంగా మారుతుంది. కొద్ది సేపటి క్రితం ముంబైలో సి.సి.ఎల్ -3 కర్టన్ రైజర్ నిర్వహించారు. సల్మాన్ ఖాన్, కత్రిన కైఫ్ ఈ కార్యక్రమంలో ప్రదర్శన ఇచ్చారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, బెంగాలీ మరియు భోజ్పురి చిత్ర పరిశ్రమల నుండి పలువురు తారలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సి.సి.ఎల్ -3 ఫిబ్రవరి 9న కొచ్చిలో మొదలు కానుంది. సి.సి.ఎల్-3 కి కాజల్ అగర్వాల్ మరియు బిపాసా బసు ప్రచార కర్తలుగా వ్యవహరిస్తున్నారు.

తాజా వార్తలు