గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం “పెద్ది” కోసం అందరికీ తెలిసిందే. ఫస్ట్ షాట్ తోనే పాన్ ఇండియా లెవెల్లో రీచ్ ని మేకర్స్ సొంతం చేసుకున్నారు. ఇక రామ్ చరణ్ రీసెంట్ గానే తన విదేశీ పర్యటన ముగించుకొని మళ్ళీ షూటింగ్ లో బిజీగా మారాడు.
అయితే ఈ లోపే తమ నిర్మాత వెంకట సతీష్ కిలారు పుట్టినరోజు రావడంతో చిత్ర యూనిట్ సహా టాలీవుడ్ లో అనేకమంది ఇతర ప్రముఖులు కూడా ఈ ఫ్యాషనేటెడ్ ప్రొడ్యూసర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మరి అలానే ఇప్పుడు పెద్ది.. రామ్ చరణ్ కూడా తన మార్క్ విషెస్ ను సెట్స్ నుంచి ఓ పిక్ తో షేర్ చేసుకొని తెలిపాడు. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్న నా ప్రొడ్యూసర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని చరణ్ అంత నమ్మకంగా పోస్ట్ చేయడం ఇపుడు వైరల్ గా మారింది.