అల్లు అర్జున్ తమ్ముడు శిరీష్ హీరోగా నటిస్తున్న మొదటి సినిమా ‘గౌరవం’. ఈ సినిమాకి రాధా మోహన్ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు, తమిళ భాషలలో నిర్మిస్తున్న ఈ సినిమాని ఏప్రిల్ 19న విడుదల చేయనున్నారు. ఈ సినిమా ఆడియోని నాగేంద్ర బాబు ఐపిఎల్ స్టేడియంలో లంచ్ చేశారు. దీనిలో శిరీష్, యామి గౌతం, ప్రకాష్ రాజ్, థమన్ లు పాల్గొన్నారు. ఈ సినిమా ఫస్ట్ ట్రైలర్ ని రామ్ చరణ్ ఈ రోజు ఉదయం హైదరాబాద్లో లాంచ్ చేశాడు. ‘ఎలాగైతే మా నాన్న (చిరంజీవి) మా మామయ్య (అల్లు అరవింద్) సలహాలు తీసుకుంటాడో అలాగే నేనుకూడా ‘ఎప్పుడైనా సలహాలు కావాలనుకుంటే నేను శిరీష్ సలహాలు తీసుకుంటాను. నీ మొదటి సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని రామ్ చరణ్ అన్నాడు.
ఈ గౌరవం సినిమాని హానర్ కిల్లింగ్స్ థీం ఆదారంగా నిర్మిస్తున్నారు. సిటీలో పెరిగిన అబ్బాయి సమాజంలో జరుగుతున్న అరాచకాలు పై ఎలా పోరాడతాడు అనేదే ఈ చిత్ర కథాంశం. ఈ సినిమాలో యామి గౌతం హీరోయిన్ గా యంగ్ లాయర్ పాత్రలో, అలాగే ప్రకాష్ రాజ్ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. థమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాకి ప్రీత సినిమాటోగ్రాఫర్.