మేలో రామ్ చరణ్ – కృష్ణవంశీల మూవీ ఫారిన్ షెడ్యూల్

Ram-Charan-and-Krishna-Vams
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామేశ్వరంలో జరుగుతోంది. అక్కడ పూర్తయిన తర్వాత పొల్లాచ్చి, నాగేర్కిల్ లో షెడ్యూల్స్ జరగనున్నాయి.

మాకు అందిన తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర టీం మేలో సుమారు 30 రోజులు పాటు జరిగే లాంగ్ షెడ్యూల్ కోసం అబ్రాడ్ వెళ్లనున్నారు. ఈ షెడ్యూల్ లో భాగంగా లండన్, పారిస్, స్కాట్లాండ్ లలో కొన్ని పాటలని, కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిమిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో శ్రీకాంత్, తమిళ నటుడు రాజ్ కిరణ్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీ కాంత్ సరసన కమలినీ ముఖర్జీ నటిస్తోంది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Exit mobile version