కృష్ణ వంశీ సినిమాపై రామ్ చరణ్ స్పందన

కృష్ణ వంశీ సినిమాపై రామ్ చరణ్ స్పందన

Published on Mar 5, 2014 12:27 AM IST

Ram-Charan
రామ్ చరణ్ కృష్ణ వంశీ దర్శకత్వంలో రాబోతున్న తన తాజా చిత్రం గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాడు. ఈ చిత్రం ప్రస్తుతం కన్యాకుమారి లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్ వచ్చే నెలలో పూర్తి కావొస్తుంది. బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం లో కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది.

రామ్ చరణ్ కృష్ణ వంశీ రాసిన కొన్ని సన్నివేశాల గురించి తన ఆనందాన్ని తన అధికారిక ఫేస్ బుక్ పేజిలో పంచుకున్నాడు. కృష్ణ వంశీ తో పని చేయడం చాలా ఆనందంగా వుంది ఆయనది అద్బుతమైన ఎనర్జీ. శ్రీకాంత్ కి నాకు వున్న సన్నివేశాలు చాలా సరదాగా వుంటాయని రామ్ చరణ్ పేర్కొన్నాడు. గత నెలలో రామేశ్వరం లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్ర యూనిట్ త్వరలో కొన్ని ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణకు విదేశాలకు వెళ్లనుందని సమాచారం. ఈ చిత్రం లో రామ్ చరణ్ ఇండియా వచ్చిన ఒక యెన్.ఆర్.ఐ పాత్రని పోషిస్తున్నాడు.

థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, కమలిని ముఖర్జీ మరియు రాజ్ కిరణ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని సమాచారం.

తాజా వార్తలు