రామ్ చరణ్ ‘ఎవడు’ త్వరలో బ్యాంకాక్ ,థాయిలాండ్లో చిత్రీకరణ జరుపుకోనుంది. ఇప్పటివరకు ఈ చిత్ర యూనిట్ రామ్ చరణ్, శృతి హాసన్ లపై హైదరాబాద్లో చిత్రీకరణ జరిపారు . మిగతా భాగాన్ని బ్యాంకాక్ లో చిత్రీకరించనున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు . శ్రుతి హాసన్ ,అమీ జాక్సన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం లో అల్లు అర్జున్, కాజల్ అతిధి పాత్రలు పోషిస్తున్నారు . దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు . జూలై రెండో భాగం లో ఈ చిత్రం విడుదల కావచ్చని సమాచారం .వంశీ పైడిపల్లి ఈ చిత్రం రూపుద్దిదుకుంటున్న తీరుపై చాలా విశ్వాసంతో వున్నాడు. ఈ చిత్రం ఒక స్టైలిష్ ఎంటర్టైనర్ . రామ్ చరణ్ ఈ చిత్రాన్ని పూర్తి చేసాక కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం షూటింగ్ లో పాల్గొనున్నాడు.