మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా – కృష్ణవంశీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం కన్యాకుమారిలో జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. అలాగే శ్రీకాంత్ ఈ సినిమాలో రామ్ చరణ్ కి బాబాయ్ గా కనిపించనున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్, శ్రీకాంత్ లపై ఓ యాక్షన్ సీక్వెన్ ని షూట్ చేస్తున్నారు. ఈ నెలాఖరు వరకూ అక్కడే షూటింగ్ జరగనున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్స్ పొల్లాచ్చి, లండన్ లలో జరగనున్నాయి.
కృష్ణవంశీ సినిమా కోసం రామ్ చరణ్ – శ్రీకాంత్ లపై రాసిన సీన్స్ కి థ్రిల్ అవ్వడమే కాకుండా, సినిమా బాగా వస్తుండడంతో చాలా హ్యాపీగా ఉన్నాడు. కాజల్ అగర్వాల్, కమలినీ ముఖర్జీ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో తమిళ నటుడు రాజ్ కిరణ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పై బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.